Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు !!
posted on: Nov 12, 2021 9:30AM
సినిమా పాట హమ్ చేయడం లేదండోయ్!! మరైతే ఏంటీ?? అంటారా అది చెప్పడానికేగా ఇప్పుడు ఇక్కడ ఇలా మీ ముందు.మనం మన చుట్టూ ఉన్న చాలామంది తమ ప్రణాళికలలో రేపు ఏంటి?? రేపు ఏమి చేద్దాం,
ఆ తరువాత ప్లాన్స్ ఏమిటి??
ఇలాంటి ఆలోచనలతో మునిగిపోయి ఉంటారు. లేదూ కొంతమంది అదే రోజు గురించి పని చేస్తున్నా, ఇతర ఆలోచనలతో ఉన్నా పూర్తిస్థాయి సాటిసిఫాక్షన్ తో ఉండరు. ఎందుకిట్లా అని ఆలోచన చేసారా ఎప్పుడైనా?? దానికి సమాధానం సులువుగా చెప్పాలంటే మనిషికి ప్రస్తుతం తనదగ్గర ఉన్నదానికంటే తనదగ్గరలేని దాని గురించి, ఎక్కడో ఉన్నదని గురించి ఆసక్తి ఎక్కువ, దానిమీద అంచనాలు ఎక్కువ. ఇంకా గట్టిగా చెప్పాలంటే రేపటి గురించి ఆశ ఎక్కువ. నిజానికి మనిషిని బతికించేది ఆశ అయినపుడు ఆశపడటంలో తప్పు లేదు.
కానీ ప్రస్థుతాన్ని నిర్లక్ష్యం చేస్తూ రేపటి విషయాల గురించి ఆశపడటం అంటే ఇంకా విత్తని విత్తనాల క్రమం గురించి ఆలోచిస్తూ భూమిని సరిగా దున్నకపోవడమే. భూమి సరిగా దున్నలేదు అనుకోండి, విత్తనాలు సరిగా వేయలేరు, ఆ తరువాత వర్షం కురిసినా విత్తనాలు మొలకెత్తవు, పంట పండదు. ఇక్కడ జరిగింది ఏమిటి?? జరగని పనిని ఆలోచిస్తూ జరిగే పనిని నిర్లక్ష్యం చేయడం వల్ల తగిన పలితం రాకపోగా, సమయం మొత్తం వృథా చేసినట్టు. ఒక అవకాశాన్ని చేజార్చుకున్నట్టు. సరిగ్గా చాలామంది జీవితంలో ఇదే చేస్తున్నారు. ప్రస్థుతంలో రేపటి గురించి ఆలోచిస్తూ ఈరోజును నిర్లక్ష్యం చేస్తున్నారు.
దాని ఫలితం ఏమిటి??
ఎంతో ఆలోచన చేసిన రేపు కూడా ఆశించిన విధంగా లేకపోవడం. ఎన్నాళ్ళు గడిచినా ఇలా సరైన ప్రణాళిక సాగకుండా నిరాశలో మిగిలిపోవడం. ఇప్పుడు అర్థం అయ్యింది కదా మనిషి నిరాశకు కారణం ఏమిటి అనేది కూడా.
అయితే ఇప్పుడేం చేయాలి??
ప్రస్థుతాన్ని అంటే ఈరోజును ఎంత బాగా ఉపయోగించుకోగలిగితే రేపు అంతకంటే బాగా మీ ముందు ముస్తాబవుతుంది. రోజులో ఉన్న 24 గంటల్లో సూర్యోదయం నుండి, నిద్రపోయేవరకు మీకున్న సమయం ఎంత?? సాధారణంగా అందరూ నిద్రపోవడానికి ఉపయోగించే 6 లేదా 8 గంటలు మినహాయిస్తే రోజులో ఉండే18 లేదా 16 గంటలను ఏమి చేస్తున్నారు?? ప్రతి రోజు ఏ పని ఎంతసేపు చేస్తున్నారు?? మీ 18 లేదా 16 గంటల పలితం ఏమిటి?? దానికి మీరు సరైన న్యాయం చేసారా?? ఇక్కడ ఒక విషయం గమనిస్తే ర్యాంకులు తెచ్చుకుంటున్న స్టూడెంట్స్ కు, ఫెయిల్ అవుతున్న స్టూడెంట్స్ కు, అట్లాగే మంచి ఎంప్లాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఉద్యోగస్తుడికి, సాధారణ ఉద్యోగస్తులకు.
ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరికి ఈ కాలమానం ఒకటే అందరికి 24 గంటలు ఉన్నాయి. దీనికి కులము, మతము, లింగ వివక్ష అంటూ ఏమీ తేడా లేదు. అలాంటప్పుడు అందరూ ఒకేలా ఎందుకు లేరు?? కొందరు ఏవో కారణాలు చెబుతారు. బహుశా వారు చెప్పినట్టే అందరికి అన్ని వనరులు, వసతులు, సౌకర్యాలు ముఖ్యంగా డబ్బును బట్టి చేకూరే ప్రయోజనాలు అందుబాటులో లేకపోవచ్చు.
కానీ అన్ని ఉండి కూడా పనికిరానట్టు ఉన్నవాళ్ల సంగతి ఏమిటి??
ఇట్లా ఆలోచిస్తే అందరికి వస్తాం ఏమిటి అనేది అర్థం అవుతుంది. లోపం ఎక్కడుందో క్షుణ్ణంగా తెలిసిపోతుంది. ఫలితంగా తమని తాము సరిదిద్దుకునే మార్గం కనిపిస్తుంది, లేకపోతే వెతుక్కునే ఆలోచన కలుగుతుంది. ఇవన్నీ జరిగితే ప్రస్తుతం అంటే ఈరోజు ఎంత గొప్పదో… దాని విలువ ఏమిటో… దాని ప్రాధాన్యత ఎలాంటిదో చాలా బాగా తెలుస్తుంది. అందుకే మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అని చెప్పింది. ఈరోజును ఎంత బాగా మలచుకుంటారో అంత గొప్ప ఫలితం మీ సొంతం.
◆వెంకటేష్ పువ్వాడ






