TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

‘ద బోయ్ నెక్ట్స్ డోర్’ అదుర్స్

Published on: Sat Jan 24, 2015 10:20AM

 

హాలీవుడ్ హాట్ హీరోయిన్ జెన్నిఫర్ లోపెజ్, ర్యాన్ గజ్‌మాన్ నటించిన హాలీవుడ్ చిత్రం ‘ద బోయ్ నెక్ట్స్ డోర్’ గురువారం నాడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. రాబ్ కోహెన్ ఈ చిత్ర దర్శకుడు. తన భర్త నుంచి కొత్తగా విడాకులు తీసుకున్న ఒక యువతిని తన పక్కింట్లో నివసించే యువకుడు ఆకర్షిస్తాడు. వారిద్దరి మధ్య సంబంధం ఏర్పడుతుంది. అయితే ఇంతలోనే వారి జీవితంలో భారీ మలుపు వస్తుంది. అప్పటి వరకూ రొమాంటిక్‌గా సాగిపోతున్న సినిమా అకస్మాత్తుగా థ్రిల్లర్ రూపంలోకి మారిపోతుంది. వారి జీవితంలో ఎలాంటి ఘటనలు ఎదురయ్యాయి, వాటి పర్యవసానాలు ఎలా వున్నాయనేది ఈ సినిమా కథాంశం. శుక్రవారం నాడు ఒక్క అమెరికాలోనే ఈ సినిమా 1,869 థియేటర్లలో విడుదలైంది. విడుదలైన ఒక్క రోజులోనే ఈ సినిమా ఒక్క అమెరికాలోనే ఐదు లక్షల డాలర్ల కలెక్షన్లలను వసూలు చేసింది. ఇది ఒక రికార్డుగా హాలీవుడ్ సినీ పండితులు చెబుతున్నారు. జెన్నిఫర్ లోపెజ్, ర్యాన్ గజ్‌మాన్ మధ్య సన్నివేశాలు అదరిపోయాయని అంటున్నారు. వీళ్ళిద్దరూ నిజంగానే లవర్సా అనిపించేంతగా ఇన్వాల్వ్ అయి నటించారన్న ప్రశంసలు వినిపిస్తున్నాయి.