TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తారా తీరం'లో రాజకీయ అలజడి..ఇరుక్కున్న రాయపాటి

Published on: Fri Apr 13, 2012 9:50AM

హైదరాబాద్: కొన్నాళ్లుగా కలకలం సృష్టిస్తున్న తారా చౌదరి టేపుల గుట్టు ఒక్కొక్కటిగా రట్టవుతోంది. మొట్టమొదటిసారిగా.... గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు పేరు వినిపించింది. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ జిల్లాలో తనకు రాజకీయ ప్రత్యర్థి అయిన మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు రాయపాటి తనను ఉపయోగించుకునేందుకు ప్రయత్నించినట్లు తార అందులో పేర్కొంది. రాయపాటి మనుషులు తనను బెదిరించిన టేపులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, మీడియాకు ఇవ్వడంలేదని కూడా వివరించింది. రాయపాటిపై ఆరోపణలకు సంబంధించిన తారా చౌదరి టేపు అనుమానాస్పదంగా ఉండటం గమనార్హం. ఇద్దరు పోలీసు అధికారులతో మాట్లాడిన టేపుల్లో సంభాషణ సహజంగా ఉండగా, రాయపాటి టేపుల్లో మాత్రం తార గొంతు మాత్రమే వినిపించింది. ఆమె ఎవరికి, ఎందుకు, ఏ సందర్భంలో ఈ మాటలు చెప్పారనే సంగతి అందులో స్పష్టం కాకపోవడం గమనార్హం. ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, దీని వెనుక కుట్ర దాగి ఉందని రాయపాటి స్పష్టం చేశారు.

తారా చౌదరి వ్యవహారంతో పలువురు ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సరస సంభాషణలు, చిత్రాలతో సెల్‌ఫోన్ మెమొరీ కార్డులు నిండిపోతుండటంతో, తార తరచూ వాటిని మార్చేదని తెలిసింది. పోలీసులు ఆమె ఇంట్లో 16 మెమొరీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్ మెయిలింగ్ ద్వారా వచ్చిన సొమ్ముతో తార వడ్డీ వ్యాపారం చేసినట్లు తెలిసింది. ఒక చిన్న నిర్మాత రూ.3 లక్షల అప్పు తీర్చకపోవడంతో, తనతో పరిచయం ఉన్న ఇద్దరు పోలీసు అధికారులను రంగంలోకి దించినట్లు తెలిసింది.