ఒక్క పదం... శక్తి అపారం...

 

థాంక్యూ... ఈ ఒక్క చిన్న మాటకి ఎంత శక్తి వుందో తెలుసా? మోడువారిన బంధం చిగురించేంత. ఒకరి సాయం పొందగానే కృతజ్ఞత తెలుపుతూ థాంక్స్ అంటాం. అయితే ఆ పదాన్ని ఇంటి బయట రోజుకి ఎన్నోసార్లు వాడే మనం మన ఇంట్లోవాళ్ళతో మాత్రం చాలా తక్కువ వాడతామట. అందులోనూ భార్యాభర్తల మధ్య ఆ పదం చాలా తక్కువగా దొర్లుతుందిట. ఒకరిమీద ఒకరికి వుండే అసంతృప్తితో ‘థాంక్స్’ చెప్పరనేది కూడా ఈ మధ్య నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది.

 

థాంక్స్ అన్న పదం వినగానే ఎదుటి మనిషి మనసు తేలికపడటం, అందులోనుంచి సానుకూలం భావం ఏర్పడటం జరుగుతుంది. ఇద్దరిమధ్య బంధం బలపడటం మొదలవుతుంది అంటున్నారు అధ్యయనకర్తలు. చిన్నమాటే... కానీ దాని ప్రభావం మాత్రం ఎక్కువ. కాబట్టి వీలయినప్పుడల్లా ‘థాంక్స్’ అని మనస్పూర్తిగా చెప్పండి. ఎదుటి మనిషికి, మనసుకి దగ్గరవ్వండి. అన్నట్టు... ఓపిగ్గా చదివినందుకు మీక్కూడా థాంక్స్.

-రమ