టిడిపికి త‌మ్మినేని షాక్‌

 

విభ‌జ‌న నేప‌ధ్యంలో తెలుగుదేశం పార్టీకి మ‌రో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు త‌మ్మినేని సీతారాం పార్టీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ తెలుగువారి ఆత్మగౌర‌వాన్ని కాపాడలేక‌పోయింది అని ఆరోపించిన ఆయ‌న పార్టీ అధినేత చంద్రబాబుకి 10 పేజీల బ‌హిరంగం లేఖ రాశారు.

లేఖ‌లో పార్టీతో పాటు చంద్రబాబుపైనా ఘాటైన విమ‌ర్శలు చేశారు త‌మ్మినేని. ఎన్టీఆర్ ఆశ‌యాల‌కు విరుద్దంగా చంద్రబాబు నాయ‌క‌త్వంలోని తెలుగుదేశం పార్టీ వ్యవ‌హ‌రిస్తోంద‌ని అన్నారు. ఎన్టీఆర్ ఆశ‌యాల‌తో పాటు, తెలుగువారి ఆత్మగౌర‌వానికి టిడిపి తూట్లుపొడుస్తుంద‌న్నారు. తమ్మినేని సీతారాం రాజీనామాతో తెలుగుదేశానికి ఉత్తరాంధ్రలో మరో గట్టి షాక్ తగిలింది.

ఇప్పటి వ‌ర‌కు ఏ పార్టీలో చేరుతున్నది ప్రక‌టించ‌క‌పోయినా త‌మ్మినేని త‌ప్పకుండా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఉత్తరాంద్రలో టిడిపికి బ‌ల‌మైన నాయ‌కుడిగా ఉన్న త‌మ్మినేని రాజీనామాతో టిడిపికి మ‌రోషాక్ త‌గిలిన‌ట్టయింది.