TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇరకాటంలో రోశయ్య

Published on: Tue Feb 28, 2012 1:32PM

హైదరాబాద్: తమిళనాడు గవర్నర్ కె. రోశయ్య ఇరకాటంలో పడనున్నారు. హైదరాబాదులోని అమీర్‌పేటలోని భూవ్యవహారం ఆయనను కష్టాల్లోకి నెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అమీర్‌పేట భూవ్యవహారంలో ఐఎఎస్ అధికారులు సమర్పించిన పత్రాలను, ఇతర సాక్ష్యాలను జోడిస్తూ తెలంగాణ న్యాయవాదుల సంఘం రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌కు, ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఫిర్యాదు చేసింది. రోశయ్యను రీకాల్ చేయాలని డిమాండ్ చేసింది. అమీర్‌పేటలోని మైత్రీవనం వద్ద కోట్లాది రూపాయల భూమిని డీనోటిఫై చేసిన కేసులో రోశయ్య చీటింగ్, అవినీతి ఆరోపణలను ఎదుర్కుంటున్నారు. ఈ కేసులో ఐఎఎస్ అధికారులు బిపి ఆచార్య, టి. సన్యాసి అప్పారావు ఎసిబి కోర్టు ముందు సాక్ష్యాలు ఇచ్చారు. భూమిని డీనోటిఫై చేయవద్దని తాము బలంగా చెప్పామని వారన్నారు.