జయలలితకు సుప్రీం నోటీసు
Published on: Tue Feb 21, 2012 3:10PM
న్యూ
ఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీంకోర్టు మంగళవారం నోటీసు జారీ చేసింది. 1992లో రూ. 2 కోట్ల రూపాయల విలువ గిఫ్ట్ కేసు ప్రొసిడింగ్స్‌ను కొట్టేస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సిబిఐ సుప్రీంకోర్టు సవాల్ చేసింది. సిబిఐ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం జయలలితకు ఆ నోటీసు జారీ చేసింది. దీంతో ఆమె మరింత చిక్కుల్లో పడ్డారు. నాలుగు వారాల్లోగా తమ నోటీసుకు వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు జయలలితను ఆదేశించింది.


