కేకేని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ చేస్తే రాజీనామా చేస్తా

 

ఏపీకి ప్రత్యేకహోదా పోరాటంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కలిసి రావాలని, లేకపోతే తెలంగాణలో ఉన్న సీమాంధ్రులను తెరాసకు ఓటు వేయోద్దని పిలుపునిస్తామని టీజీ వెంకటేష్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. దీనిపై స్పందించిన కే కేశవరావు, టీజీ ఓ పిచ్చోడు అంటూ విమర్శలు చేసారు.. మరి టీజీ ఊరుకుంటారా.. కేకే పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. కేకే ని కాంగ్రెస్ లో ఉన్నప్పుడే కార్యకర్తలు పిచ్చోడిలా చూసేవారని, ఇప్పుడు ఆ పిచ్చి ముదిరిందని మండిపడ్డారు.. అంతేకాదు, 'మా దేహంలో రక్తం ఉంది.. నీ దేహంలో సారా ఉంది.. రాత్రి అయితే సారా తాగి కేసీఆర్ కాళ్ళు ఒత్తుతావు' అంటూ తీవ్ర విమర్శలు చేసారు.. 'కేకేను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ప్రతిపాదిస్తే ప్రతిపక్షాలు అంగీకరించవు.. నువ్వు డిప్యూటీ చైర్మన్‌ అవుతావా?.. నీ ముఖం.. నిన్ను డిప్యూటీ చైర్మన్‌ చేస్తే.. ఆ రోజే నేను రాజ్యసభకు రాజీనామా చేసి పోతా.. ఎందుకు ఉండాలి అటువంటి పనికిమాలినోడు ఉన్నప్పుడు'  అని టీజీ ఘాటు వ్యాఖ్యలు చేసారు.. కేకే, టీజీ ల మధ్య మాటల యుద్ధం ఇంకెంత దూరం వెళ్తుందో ఏంటో.