TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇంటి ముందు ఉన్న చెట్టు పైనే ఐసోలేషన్ ..

Published on: Sat May 15, 2021 4:14PM

కరోనా వల్ల ప్రపంచం మొత్తం తలకిందుల అవుతున్నాయి. జనాలు పిట్టల రాలిపోతున్నారు. అదే విదంగా యావత్ భారత్  కన్నీటి పర్వంలో మునిగిపోతుంది. ఎక్కడ చూసిన శవాలు గుట్టల కనిపిస్తున్నాయి. ఇంకా ఈ కరోనాతో ప్రజలకు పాట్లు తప్పవా.. ఇంకా ఎన్నాళ్లు ఇలాగే ప్రాణాలకు భయపడుతూ, ఆకలికి అలమటించాలి. ఆర్థికంగా ఉన్నవాళ్లను, లేనివాళ్లను కరోనా ఇబ్బంది పట్టిన. ఉన్నవాళ్ళకి కొంత ఉపశమనంగానే ఉన్నారు. కానీ లేని వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా తయారు అవుతుంది. హాస్పిటల్ కి వెళితే బెడ్స్ దొరకవు. ఆక్సిజన్ ఉండదు. సరైన వైద్యం అందక ప్రజలు అస్తవేస్తాలు పడుతున్నారు. ఇదంతా పక్కన పెడితే ఇంట్లోనే ఉంది చికిత్స తీసుకుందాం అనుకుంటే. మన దేశంలో చాలా మందికి ఒక రూమ్లో నలుగురు నివస్తిస్తున్నారు. మరి ఆ వాళ్ళ కు ఒక్కరికి కరోనా వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి..?  వాళ్ళు ఎక్కడ తల దాచుకోవాలి. ఇంట్లో కరోనా వచ్చిన వ్యక్తి ఆ ఇంట్లోనే ఉంటే మిగతావాళ్లు పరిస్థితి ఏంటి ? ఆ కరోనా నుండి వాళ్ళను ఎవరు కాపాడాలి. తాజాగా నల్లగొండ జిల్లాలో ఇదే జరిగింది.  

నల్గొండ జిల్లాలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కరోనా బారినపడిన ఓ బీటెక్ విద్యార్థి చెట్టుపై నివాసం ఏర్పరచుకోవడం మీడియా కంటపడింది. అడవిదేవులపల్లి మండలం కొత్త నందికొండ గ్రామానికి చెందిన రమావత్ శివానాయక్ ఇంజినీరింగ్ విద్య అభ్యసిస్తున్నాడు. అయితే, కరోనా వ్యాప్తి కారణంగా తరగతులు నిలిచిపోవడంతో గత కొన్నినెలలుగా గ్రామంలోనే ఉంటూ కుటుంబసభ్యులతో కలిసి వ్యవసాయం చేస్తున్నాడు.

ఇటీవలే శివానాయక్ స్థానిక ఐకేపీ కేంద్రంలో ధాన్యం విక్రయించాడు. ఆ తర్వాత జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతుండడంతో కరోనా టెస్టు చేయించగా, పాజిటివ్ అని వెల్లడైంది. అయితే, తమ ఇంట్లో ఉన్నది ఒకే గది కావడంతో ఐసోలేషన్ లో ఉండేందుకు తన ఇంటి సమీపంలోని చెట్టునే ఆవాసంగా మలుచుకున్నాడు. చెట్టుపై మంచాన్ని గట్టిగా తాళ్లతో కట్టి దానిపైనే విశ్రమిస్తూ ఐసోలేషన్ లో గడుపుతున్నాడు. గత 9 రోజులుగా ఇదే విధంగా చెట్టుపైనే శివానాయక్ మకాం ఉంటున్నాడు.