TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో ఆరిఫ్ హుస్సేన్ అరెస్టు

Published on: Fri Aug 29, 2025 10:23AM

బీహార్ కు చెందిన ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తాలిబ్ ను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అరెస్టు చేసింది. విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో కీలక నిందితుడైన ఆరిఫ్ హుస్సేన్  దేశం విడిచి పారిపోయేందుకు చేసిన ప్రయత్నాన్ని ఎన్ఐఏ అడ్డుకుంది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో అతడిని అదుపులోనికి తీసుకుంది.

ఆరిఫ్ వివిధ ప్రాంతాల్లో ఉగ్రదాడులు చేసేందుకు ఆయుధాలను సమకూరుస్తాడనీ, దేశంలో  జిహాదీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడనీ అభియోగాలు ఉన్నాయి.  సిరాజ్ ,సమీర్ ల అరెస్టుల తర్వాత   అప్రమత్తమైన ఆరిఫ్ హుస్సేన్ విదేశాలకు పరారయ్యేందకు చేసిన ప్రయత్నాన్ని భగ్నం చేసిన ఎన్ఐఏ ఆయనను ఢిల్లీ ఎయిర్ పోర్టులో గురువారం (ఆగస్టు 28) అదుపులోనికి తీసుకుంది. ఆరిఫ్ ను శుక్రవారం (ఆగస్టు 29) విశాఖ కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.