TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

భారత్ పై ఉగ్రదాడి కుట్ర..15 ఏళ్ల జైలుశిక్ష

Published on: Wed Mar 8, 2017 9:52AM


భారతదేశంలో ఉగ్రదాడి జరిపేందుకు ఎప్పుడూ ఏదో ఒక కుట్ర పన్నుతూనే ఉంటారు. అలా కుట్ర పన్నిన వ్యక్తికి 15 ఏళ్ల జైలుశిక్ష వేసింది అమెరికా కోర్టు. వివరాల ప్రకారం..బల్వీందర్ సింగ్ (42) అనే ఎన్నారై ఓ భారత ప్రభుత్వాధికారిని చంపేందుకు కుట్ర పన్నిన నేపథ్యంలో అమెరికా జిల్లా జడ్జి లారీ హిక్స్ 180 నెలలు అంటే 15 ఏళ్లు జైలు శిక్ష విధించారు. కుట్ర పన్నడమే కాకుండా.. వాళ్లకు కావల్సిన వనరులను కూడా ఇతడు సమకూర్చినట్లు విచారణలో తేలింది. రెనో ప్రాంతానికి చెందిన బల్వీందర్ సింగ్ రెండు ఉగ్రవాద గ్రూపులలో సభ్యుడని, భారత ప్రభుత్వాన్ని వణికించేందుకు, అక్కడి అమాయక ప్రజలను హతమార్చేందుకు కావల్సిన సామగ్రిని ఇతడు వాళ్లకు అందించాడని ప్రాసిక్యూటర్లు తెలిపారు.

 

కాగా 2013 నవంబర్ నెలలో బల్వీందర్ సింగ్ రెండు నైట్ విజన్ గాగుల్స్, ఒక ల్యాప్‌టాప్ కొని తన సహచరుడికి ఇచ్చాడు. అతడు శాన్‌ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్ వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలోనే అమెరికా అధికారులు అతన్నివిమానాశ్రయంలోనే పట్టుకున్నారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా బల్వీందర్ విషయం తెలిసింది. అనంతరం పోలీసులు బల్వీందర్ సింగ్ ను పట్టుకొని అరెస్ట్ చేయగా.. ఇప్పుడు అతనికి జైలు శిక్ష పడింది.