దాడి చేసింది మేమే..
Published on: Tue Jan 5, 2016 9:16AM

పంజాబ్ లోని పఠాన్ కోట్ విమాన స్థావరంపై ఉగ్రవాదులు దాడి జరిపిన సంగతి తెలిసిందే. గత నాలుగు రోజుల నుండి ఉగ్రవాదులు.. భద్రతా దళాల మధ్య కాల్పులు జరగుతూనే ఉన్నాయి. ఈ ఉగ్రదాడిలో ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి చెందగా, భద్రతా దళాల కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఇప్పుడు పఠాన్ కోట్ విమాన స్థావరంపై ఉగ్రదాడి చేసింది తామేనంటూ..
పాకిస్థాన్ ప్రేరేపిత యూనైటెడ్ జిహాద్ కౌన్సిల్(యూజేసీ) ప్రకటించుకుంది. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉగ్రవాద సంస్థ హైవే స్కాడ్‌తో అనుబంధం ఉన్న ఐక్య జిహాది మండలి పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడికి దిగినట్లు పేర్కొంది. మరి దీనికి భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.


