TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టెన్షన్‌ పడుతున్న మంత్రి పార్థసారథి

Published on: Fri Aug 3, 2012 11:45AM

ప్రాథమికవిద్యాశాఖామంత్రి పార్థసారథి దాదాపు ఇరుక్కునట్లే. ఒకవైపు ఫెరా చట్టం ఉల్లంఘన, మరోవైపు ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు సరిగ్గా లేవన్న ఆరోపణలు ఆయన పీకలకు చుట్టుకున్నాయి. ఫెరా చట్టం కింద ఆయనకు శిక్ష కూడా ఖరారయ్యాక ఈ ఎన్నికల అంశం ప్రస్తావనలోకి వచ్చింది. ఈ అంశం ఎప్పుడైతే ప్రస్తావనకు వచ్చిందో అప్పుడే ఇక భవిష్యత్తుల్లో దీన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని మంత్రి గుర్తించారు. ఆయన అలా గుర్తించి వారం తిరక్కుండానే ఎన్నికల కమిషన్‌ స్పందించింది.

 

 

మంత్రిపార్థసారథి ఎన్నికల అఫిడవిట్‌లో సరైన వివరాలు ఇవ్వలేదని తేలితే తదుపరి చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషన్‌ రాష్ట్ర అథికారి భన్వర్‌లాల్‌ తెలిపారు. పార్థసారథి దాఖలు చేసిన అఫిడవిట్‌ పరిశీలించి తగిన వివరాలు తనకు సమర్పించాలని కృష్ణాజిల్లా అథికారులను ఆదేశించామన్నారు. ఈ ఆదేశాల ప్రకారం అఫిడవిట్‌లో మంత్రి నమోదు చేసిన వివరాలు తప్పుడువని తేలితే కఠినచర్యలు తప్పవని న్యాయ నిపుణులు అంటున్నారు. అప్పుడు దాదాపు ఎన్నికల కమిషనును మోసం చేయటం రాజ్యాంగాన్ని థిక్కరించట మంత పెద్ద నేరమని వారు వివరిస్తున్నారు. అంటే నేరం రుజువైతే కఠిన శిక్ష ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో మంత్రి పార్థసారథి కూడా ఆందోళనగా ఉన్నారని తెలుస్తోంది. తాను దాదాపుగా ఇరుక్కున్నానని ఆయన తన సన్నిహితుల వద్ద వాపోతున్నారని సమాచారం. ప్రభుత్వం చేసేదేముందీ ఒక్క న్యాయసహాయం తప్ప అని మంత్రి ముందే అనేసి కొందరు నాలిక్కరుచుకున్నారట. దీంతో మంత్రి ఆందోళన మరింత పెరిగిందంటున్నారు. ఈ వేదనలో ఆయన తన కర్తవ్యం సరిగా నిర్వర్తించలేరు కాబట్టి మంత్రిని మార్చాలని విద్యార్థి, ఉపాథ్యాయ సంఘాలు డిమాండు చేస్తున్నాయి. దీంతో ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తన జీవితం ఉందని మంత్రి వాపోయారట.