TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మార్షల్స్ వర్సెస్ బీఆర్ఎస్ సభ్యలు.. శాసనమండలి వద్ద తోపులాట

Published on: Mon Mar 30, 2026 12:30PM

తెలంగాణ శాసనమండలి శాసనమండలి భవనం వద్ద లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. మంత్రి పొంగులేటి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించడంతో  ఉద్రిక్తత నెలకొంది.  మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలి,  అక్రమాలకు బాధ్యత వహించాలి,  ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ  ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు.

 సభ్యులు ప్లకార్డులతో నిరసన తెలపడాన్ని మార్షల్స్ అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.  ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం మార్షల్స్‌ను అడ్డం పెట్టుకుంటోందని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొంగులేటి కుటుంబానికి చెందిన 'రాఘవ కన్‌స్ట్రక్షన్స్' శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడలో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా భారీ స్టోన్ క్రషర్‌ను నడుపుతోందని బీఆర్ఎస్ నేతలు కొన్ని రోజులుగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ సభ్యులు శాసనమండలి వద్ద మంత్రి పొంగులేటి రాజీనామాను డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.