TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైద్రాబాద్ లో పెరుగుతున్న ఊష్ణోగ్రతలు

Published on: Sat May 20, 2023 12:21PM

హైదరాబాద్ ఊష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. పాదరస ముల్లు పై పైకి ఎగబాకుతుంది. శుక్రవారం రోజు 42.6 డిగ్రీల సెల్సియస్  పెరిగినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ లో ఖైరతాబాద్ అత్యంత ఊష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ(టిఎస్డి పిఎస్) తెలియజేసిన వివరాల ప్రకారం ఖైరతాబాద్ తో పాటు ఇతర ఎనిమిది ప్రాంతాల్లో ఊష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. 40 డిగ్రీలకంటే ఎక్కువగా  సెల్సియస్ నమోదవుతున్నాయి. 
ఖైరతాబాద్ (42.5) డిగ్రీల సెల్సియస్),
చార్మినార్(41.1 డిగ్రీల సెల్సియస్),
నాంపల్లి (40.7 డిగ్రీల సెల్సియస్),
బండ్ల గూడ (40.3 డిగ్రీల సెల్సియస్)
హిమాయత్ నగర్ (40.3 డిగ్రీల సెల్సియస్), 
ముషీరాబాద్(40.3 డిగ్రీల సెల్సియస్),
షేక్ పేట(40.2 డిగ్రీల సెల్సియస్)గా నమోదైంది. ఉష్ణోగ్రతలు ఒక్క హైదరాబాద్ లోనే కాదు తెలంగాణా జిల్లాల్లో ఊష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటున్నాయి.  
శుక్రవారం నల్గొండ జిల్లా దామరచర్ల , కరీంనగర్ వీర్నవంక 45.4 డిగ్రీల సెల్సియస్ ఊష్ణోగ్రతలు నమోదయ్యాయి.  
హైదరాబాద్ లో ఎండలు మరింత ముదరనున్నాయని వాతావారణ శాఖ హెచ్చరిస్తోంది. మే  22 వరకు ఇదే పరిస్థితి. 38 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని అంచనా.  మిగతా జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. 

వాస్తవానికి హైదరాబాద్ ఊష్ణ మండల ప్రాంతం. ఎండాకాలంలో చెమటలు కక్కడం ఇక్కడ సర్వ సాధారణం. గత 120 సంవత్సరాల్లో ప్రస్తుతమున్న టెంపొరేచర్ ఎక్కువేనని వావారణ శాఖ వెల్లడించింది.