‘టెంపర్’... కొన్ని పాయింట్లు...



జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ సినిమా శుక్రవారం నాడు విడుదలవుతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హీరోయిన్ కాజల్. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని విశేషాలు...

*‘టెంపర్’ జూనియర్ ఎన్టీఆర్‌కి తప్పకుండా విజయం సాధించాల్సిన సినిమాలు. ఈ సినిమా అటూ ఇటూ అయితే కష్టమే.

* ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ దయా దాక్షిణ్యాలు లేని దయా అనే పాత్రను ధరించాడు.

* హీరో పాత్రకు దయ లేకపోయినప్పటికీ సినిమాలో మాత్రం కామెడీ ఫుల్లుగా వుంటుందని తెలుస్తోంది.

* తాను తన ప్రతి సినిమా కోసం కష్టపడి పనిచేసేవాడినని, ఈ సినిమా కోసం మాత్రం కసితో పనిచేశానని జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు.

* ‘టెంపర్’ ఆడియో పర్లేదని అనిపించుకుంది.

* ‘టెంపర్’లో జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారి సిక్స్ ప్యాక్‌లో కనిపించబోతున్నాడు.

* ఎన్టీఆర్ పూర్తిస్థాయి పోలీసు అధికారి పాత్రలో నటించిన సినిమా ఇది.