TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఘనంగా తెలుగువన్ 16వ వార్షికోత్సవం

Published on: Tue May 10, 2016 6:46PM

 

తెలుగు జాతి ఖ్యాతిని దశదిశలా వ్యాపింపచేస్తూ..ప్రపంచవ్యాప్తంగా తెలుగువారిని ఒక్కతాటి మీదకు తీసుకువచ్చిన తెలుగువన్ విజయవంతంగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో వార్షికోత్సవ సంబరాలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా టీవీ9 సీఈవో రవిప్రకాశ్ హాజరయ్యారు.

 

 

ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన వారిని ఉద్దేశించి ప్రసంగించిన రవిప్రకాశ్ 15 ఏళ్లుగా తెలుగుభాష అభివృద్ధికి కృషి చేస్తూ..ప్రపంచ నలుమూలలా ఉన్న తెలుగువారిని కలుపుతున్న తెలుగువన్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఇంటర్నెట్ ప్రాముఖ్యతను పదిహేనేళ్ల క్రితమే గుర్తించి తెలుగువన్.కామ్‌ను ప్రారంభించిన సంస్థ ఎండీ రవిశంకర్ గారి ముందుచూపుని రవిప్రకాశ్ కొనియాడారు. తెలుగువన్ ఇంకా ఎన్నో వార్షికోత్సవాలను జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం తెలుగువన్‌లో వివిధ కార్యక్రమాలు రూపొందించి విశేష ప్రతిభ కనబరచిన దర్శకులకు రవిప్రకాశ్ చేతుల మీదుగా అవార్డులు అందజేశారు.