TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఐఏఎస్ లు ప్రేక్షకపాత్రకు పరిమితమౌతున్నారా: తెలుగువన్ ఇంటలెక్చువల్ టాక్ షోలో చర్చ.!

Published on: Mon Nov 23, 2026 1:18PM

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారుతుంటాయి.. రాజకీయ నాయకులు మారుతుంటారు. కానీ ప్రభుత్వ యంత్రాంగం మాత్రం నిరంతరం పనిచేస్తూనే ఉండాలి. చట్టాలు, నిబంధనల ప్రకారం పాలన సాగించాల్సిన బాధ్యత ఉన్న అధికారులే వాటి ఉల్లంఘనలను చూస్తూ మౌనంగా ఉంటే? వ్యవస్థలో కీలక స్థానాల్లో ఉన్న ఐఏఎస్ అధికారులు తమ బాధ్యతలను ఎంతవరకు నిర్వర్తిస్తున్నారు? ఇప్పుడు ఈ ప్రశ్నలే పరిపాలనా వ్యవస్థపై కొత్త చర్చకు తెరలేపుతున్నాయి.

ఇదే అంశంపై తెలుగువన్ న్యూస్ చానెల్ లో ప్రతి సోమవారం ప్రసారమయ్యే ఇంటలెక్చువల్ టాక్ కార్యక్రమంలో తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠంనేని, విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ చర్చించారు.

ఇప్పటి పరిస్థితుల్లో ఐఏఎస్ లు విధాన నిర్ణయాల నుంచి ప్రతి విషయంలోనూ ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారా? వారి విధుల నిర్వహణలో నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారా? అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతున్నారా? అన్న విషయంపై ఈ వారం ఇంటలెక్చువల్  టాక్ లో చర్చ జరిగింది. అందుకు సంబంధించిన ప్రొమో విడుదలైంది. ఈ చర్చ పూర్తి ఎపిసోడ్ సోమవారం (నవంబర్ 23) సాయంత్రం 7 గంటలకు ప్రసారం అవుతుంది. 

 

[TeluguOne, Intelectual TalkShow, Kantamneni Ravishankar, PVRamesh]