TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

న్యూయార్క్‌లో తెలుగు యువకుడు దారుణ హత్య

Published on: Sat Jun 6, 2026 8:32PM

 

అమెరికాలోని న్యూయార్క్ సిటీలోలో తెలుగు యువకుడు కుంచా అన్షుల్  దారుణ హత్యకు గురైనాడు. మేడ్చల్ జిల్లాలోని పేట్ బషీరాబాద్‌కి  చెందిన అన్షుల్ అక్కడ పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో పిజ్జా డెలివరీ కోసం వెళ్లిన అన్షుల్‌పై గుర్తుతెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. రాత్రి 12 గంటల సమయంలో డెలివరీ నిర్వహిస్తుండగా గన్‌తో కాల్చి హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడైంది. తీవ్ర గాయాలతో  అన్షుల్‌ కుప్పకూలి కింద పడిపోయాడు. 

అతని వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో పేట్ బషీరాబాద్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొడుకు మరణ వార్త విన్న ఆ తల్లిదండ్రుల రోధన స్థానికులను సైతం కంటతడి పెట్టించింది. అన్షుల్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు, బంధువులు కోరుతున్నారు. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు, దుండగుల వివరాలు ఇంకా వెల్లడికాలేదు.