TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉక్రెయిన్‌లో వంద‌లాది తెలుగు స్టూడెంట్స్‌.. వారంతా సేఫేనా?

Published on: Thu Feb 24, 2022 10:54AM

ఉక్రెయిన్‌పై ర‌ష్యా దండెత్తింది. యుద్ధం మొద‌లైపోయింది. బాంబుల‌తో విరుచుకుప‌డుతోంది. జ‌నం బిక్కుబిక్కుమంటూ త‌ల‌దాచుకుంటున్నారు. ఆ వార్ ఇప్ప‌ట్లో ఆగేలా లేదు.. ర‌ష్యా వెన‌క్కి త‌గ్గేలా లేదు.. ప్ర‌పంచ దేశాల ప్ర‌య‌త్నాల‌న్నీ విఫ‌లం.. అలాంటి వార్ జోన్‌లో మ‌న తెలుగు వారు ఉండ‌టం తీవ్ర ఆందోళ‌న‌క‌రం. రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థుల‌తో పాటు అనేక మంది ఇండియ‌న్ స్టూడెంట్స్ ఉక్రెయిన్‌లో వివిధ కోర్సులు చ‌దువుతున్నారు. వారిలో మెడిసిన్ చ‌దివేవారే అధికం. మ‌న‌తో పోలిస్తే.. అక్క‌డా వైద్య విద్య కోర్సు ఫీజులు త‌క్కువ‌. అందుకే, ర‌ష్యా, చైనాలానే ఉక్రెయిన్‌కు అనేక మంది భారతీయ విద్యార్థులు మెడిసిన్ చ‌దివేందుకు వెళుతుంటారు. తాజాగా యుద్ధ వాతావర‌ణంగా వారంతా అక్క‌డే చిక్కుకుపోవ‌డం క‌ల‌వ‌రం రేపుతోంది. 

ఉక్రెయిన్‌లో ఉన్న భార‌తీయుల‌ను దేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర‌ ప్ర‌భుత్వం ఓ ఎయిర్ ఇండియా విమానాన్ని అక్క‌డికి పంపించింది. అయితే, ఆ విమానం అక్క‌డికి చేరుకుక‌ముందే.. వార్ సైర‌న్ మోగిపోయింది. ఉక్రెయిన్ త‌న దేశ గ‌గ‌న త‌లాన్ని మూసేసింది. దీంతో.. ఎయిర్ ఇండియా ఫ్లైట్ వెన‌క్కి తిరిగి వచ్చేసింది. 

ఇక‌.. ఉక్రెయిన్‌లో వేలాది మంది భార‌తీయ విద్యార్థులు ఇప్ప‌టికీ అక్క‌డే ఉన్నార‌ని లెక్క‌లు చెబుతున్నాయి. అందులుఓ మ‌న తెలుగు వారి సంఖ్యా ఎక్కువే. సుమారు 400 మంది తెలుగు విద్యార్థులు అక్క‌డ చిక్కుచు పోయిన‌ట్టు తెలుస్తోంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు దాదాపు 400 వరకు.. తెలుగు విద్యార్థుల తల్లిదండ్రులు నుంచి రిక్వెస్టులు వ‌చ్చాయి. తమ పిల్లలను క్షేమంగా స్వదేశానికి తీసుకురావాల్సిందిగా వారంతా కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరారు. ఆ మేర‌కు ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ అధికారులను సంప్రదించి.. విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తరలించాల్సిందిగా కోరినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) తెలిపింది. ఎంఈఏ అధికారులు ఉక్రెయిన్‌లోని తెలుగు మాట్లాడే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విద్యార్థుల నివాస చిరునామాలకు సంబంధించి తెలంగాణ ఎన్నారై సెల్ అధికారుల నుండి సమాచారాన్ని కోరారు.