ఘనంగా ‘తెలుగువన్’ 18వ వారికోత్సవం...

 

తెలుగు జాతి ఖ్యాతిని దశదిశలా వ్యాపింపచేస్తూ..ప్రపంచవ్యాప్తంగా తెలుగువారిని ఒక్కతాటి మీదకు తీసుకువచ్చిన తెలుగువన్ విజయవంతంగా 17 సంవత్సరాలు పూర్తి చేసుకుని 18 వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తెలుగువన్ మేనేజింగ్ డైరెక్టర్ కంఠంనేని రవిశంకర్ గారు మాట్లాడుతూ..‘‘పదిహేడేళ్ల క్రితం నాకు వచ్చిన చిన్న ఆలోచనతో  ‘తెలుగువన్’ రూపొందించామని... ఇప్పుడున్న ఉన్నత స్థాయికిచేరుకుందని అన్నారు. ఈ పదిహేడేళ్ల ప్రస్థానంలో వచ్చిన ఎన్నో ఆటుపోట్లను ఎదురొడ్డి నిలిచి ‘తెలుగువన్’ని విజేతగా నిలిపాం. ఇందులో నాకు సహకారం అందించిన తెలుగువన్ కుటుంబానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలని తెలిపారు. ప్రపంచంలోని తెలుగువారు ఒక్కటిగా వుండాలి, నంబర్ వన్ స్థానంలో వుండాలనే ఉద్దేశంతోనే మా పోర్టల్ పేరును ‘తెలుగువన్’ అనిపెట్టాం... ‘తెలుగువన్’కు ప్రపంచ వ్యాప్తంగా అద్భుత ఆదరణ లభిస్తోంది... అలాగే తెలుగువన్ రేడియో ‘టోరి’ కి కూడా మంచి ఆదారణ ఉందని.. భవిష్యత్తులో దీనిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని దానికి అందరూ కృషిచేయాలని చెప్పారు. డిజిటల్ మీడియా అద్భుత పురోగతి వైపు దూసుకు వెళ్తోన్న ప్రస్తుత తరుణంలో తెలుగువన్ కూడా అన్ని అవకాశాలను అంది పుచ్చుకుని, మరింత అభివృద్ధి సాధించబోతోంది. ఎంతో మంది కళాకారులకు తెలుగువన్ ఓ ఫ్లాట్ ఫాం అవుతుంది....ఎంతో మంది కొత్త కొత్త నటులు.. డైరెక్టర్లు తెలుగువన్ నుండి వెళ్లి మంచిస్థాయిలో ఉన్నారని అన్నారు. మా ‘తెలుగువన్’ విజయాలు సాధించడంతోపాటు సామాజిక బాధ్యతలను  కూడా గుర్తుంచుకుని, పాటిస్తోందని చెప్పారు. మరి ముందు ముందు ఎన్నో విజయాలు సాధించి... తెలుగువన్ ఇంకా ఎన్నో వార్షికోత్సవాలను జరుపుకోవాలని ఆశిద్దాం.