కెన్యా... ఎబోలా కాదు న్యుమోనియా
Published on: Thu Aug 21, 2014 8:38PM
.jpg)
ఆఫ్రికన్ దేశాలను ప్రమాదకరమైన ఎబోలా వైరస్ గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్ కారణంగా కెన్యాలోని ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మరణించినట్టు వార్తలు వచ్చాయి. మృతుడు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం చిటుకురాళ్లు గ్రామానికి చెందిన గజేందర్ రెడ్డిగా గుర్తించారు. అయితే ఆయన ఎబోలా కారణంగా మరణించలేదని, న్యుమోనియా కారణంగా మరణించాడని వైద్యులు తెలిపారు. విషజ్వరం విషజ్వరం ఆయన మరణించినట్టు తెలుస్తోంది.


