మా నాన్నకి నేను డాక్టర్‌నో.. ఇంజనీరో అవ్వాలని

ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉల్లాసంగా గడుపుతున్నారు. ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ.. వచ్చిన అతిథుల్ని పలకరిస్తూ.. గురువులను సత్కరిసూ సీఎం చిన్న పిల్లాడిలా కేరింతలు కొడుతున్నారు. తాజాగా ఇవాళ తెలంగాణ సారస్వత పరిషత్‌లో అవధాని జీఎం రామశర్మచే నిర్వహించబడిన శతావధానం కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవధాని రామశర్మ.. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలను పద్యరూపంలో అద్భుతంగా వర్ణించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. నేను డాక్టర్ లేదా ఇంజినీర్‌ కావాలని మా నాన్న కోరుకునే వారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. మా గురువు గారు సాహితీ కవాటాలు తెరిచి నన్ను సాహిత్యం వైపు తీసుకుపోయారని తెలిపారు. ఇంటర్ చదివే రోజుల్లో మా గురువులు తనను ఎంతో ప్రోత్సహించారని ముఖ్యమంత్రి చెప్పారు. ఆ రోజుల్లో నాకు 3 వేల తెలుగు పద్యాలు కంఠతా వచ్చేవని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. అనంతరం రామశర్మను సీఎం శాలువాతో సత్కరించారు.