TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అక్కడ అన్నీ ‘తెలుగే’ !

Published on: Sat Dec 1, 2012 10:20AM

 

 telugu latest news,Telugu language, Telugu language ap, ap Telugu language, telugu latest news, telugu political news

 

ఆ కార్యాలయం రాష్ట్రంలోని అన్నీ ఇతర కార్యాలయాలకు భిన్నం. అక్కడ ఇంగ్లీష్ అనే పదమే వినపడదు. అక్కడ నుండి జరిగే అన్ని ప్రత్యుత్తరాలు తెలుగు లోనే జరుగుతాయి. ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడే వారు కూడా అక్కడ వస్తే మాత్రం తెలుగు లోనే మాట్లాడాలి. ఆ కార్యాలయం ఎక్కడో తెలుసుకోవాలని ఉందా? అదే మన రాజధానిలోని కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయం (పీసీబి). అక్కడ ఉద్యోగులు అయినా, పని మీద వచ్చిన వారు అయినా తెలుగు లోనే మాట్లాడాల్సి ఉంటుంది. ఇదే ఈ కార్యాలయం ప్రత్యేకత.


ఇక్కడ అన్ని ప్రత్యుత్తరాలు తెలుగు లోనే జరగాలని ఈ కార్యాలయ అధిపతి, బోర్డు సభ్య కార్యదర్శి రవి చంద్ర ఉత్తర్వులు జారీ చేసి, తెలుగు భాష ఫై తన అభిమానాన్ని చాటుకున్నారు. త్వరలో, ఈ కార్యాలయంలో జరిగే అన్ని పనులు తెలుగు లోనే జరిగే స్థాయికి చేరాలని రవి చంద్ర సూచించారు. రాష్ట్రంలో ఇంగ్లీష్ మాట్లాడేవారు తనకు తెలిసి నాలుగు శాతం మంది కూడా ఉండరని ఈ ఐఏఎస్ అధికారి అన్నారు.