TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రారంభ‌మైన తెలుగుజాతి ఆత్మగౌర‌వ యాత్ర

Published on: Sun Sep 1, 2013 11:40AM

 

తెలంగాణ ఏర్పాట ప్రక‌ట‌న‌తో రాష్ట్రం అగ్ని గుండంగా మారిన నేప‌ధ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు జాతి ఆత్మగౌర‌వ యాత్ర చేస్తున్నారు. ఆదివారం నుంచి ఈ యాత్రను చెప‌ట్టనున్నారు చంద్రబాబు. ఆదివారం ఉద‌యం ఎన్టీఆర్ ఘాట్లో నివాళు అర్పించిన ఆయ‌న గుంటూరు జిల్లా దాచేప‌ల్లి మండ‌లం పొందుగుల వెళ్లారు. అక్కడి నుంచే యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.

మొద‌టి విడ‌త‌లో గుంటూరు, కృష్ణా జిల్లాలో ప‌ర్యటించ‌నున్నారు. చంద్రబాబు యాత్రకు సంబందించి తొలి 5 రోజుల షెడ్యూల్ ఖ‌రార‌యింది. తొలి రోజు పొందుగుల నుంచి యాత్ర ప్రారంభించి శ్రీన‌గ‌ర్‌, గామాల‌పాడు, న‌డికుడి, దాచేప‌ల్లి, పిఠాపురం, బ్రాహ్మణ‌ప‌ల్లి మీదుగా పిడుగురాళ్ల వ‌ర‌కు 35 కిలో మీట‌ర్ల యాత్ర చేయ‌నున్నారు.