తెలుగు హీరో కమలాకర్ రెడ్డి మృతి
Published on: Sat Jul 13, 2013 11:30AM

తెలుగు సినిమా నటుడు బూచేపల్లి కమలాకర్ రెడ్డి ఈ ఉదయం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో కన్నుమూశారు. ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన దర్శి మాజీ ఎంపీ కుమారుడైన బూచేపల్లి కమలాకర్ రెడ్డి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన వయసు 37 సంవత్సరాలు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలున్నారు. అభి చిత్రంతో పాటు సన్ని, హాసిని, సంచలనం వంటి చిత్రాల్లో కమలాకర్‌రెడ్డి హీరోగా నటించారు. ప్రస్తుతం కమలాకర్ నటిస్తున్న బ్యాండ్ బాలు చిత్రం షూటింగ్ పూర్తై విడుదలకు సిద్దంగా ఉంది.


