సర్వేలో పెరిగిన టీడీపీ గ్రాఫ్...ముందస్తు ఎన్నికలకు బాబు

ఆంధ్రప్రదేశ్‌లో 2019కి ముందే ఎన్నికలు రావొచ్చంటున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయన అలా అనడానికి కారణాలు లేకపోలేదు.. ఏపీలో వివిధ పార్టీల బలాబలాలు.. ఏ పార్టీపై ప్రజలు ఎలా అనుకుంటున్నారు..అధికార పార్టీపై వ్యతిరేకత ఎలా ఉంది తదితర అంశాలపై చంద్రబాబు సర్వే చేయించారు. దానిలో గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి టీడీపీకి 16.13 ఓట్ల శాతం పెరిగిందని, అలాగే వైసీపీ ఓట్ల శాతం 13.45 మేర తగ్గిందని వివరించారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే టీడీపీకి 16.13 ఓట్లశాతం పెరిగిందని, అలాగే వైసీపీ ఓట్ల శాతం 13.45 మేర తగ్గిందని వివరించారు.

 

ఇక రాష్ట్ర విభజన చేసి నామరూపాల్లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం కేవలం ఒక్క శాతానికే పరిమితమైంది. అలాగే 2014 ఎన్నికలతో పోల్చుకుంటే ముస్లింలు ఉన్న ప్రాంతాల్లో వార్డు ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగిందని అమరావతిలో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఈ మేరకు సీఎం పార్టీ శ్రేణులకు వివరించారు. ఎన్నికలు 2019లో కాదని..వీలైతే 2018 చివరిలో జరిగే అవకాశం ఉందని అందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఇప్పటి నుంచే బహిరంగ సభలు నిర్వహించి..ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాలు తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.