తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం తెచ్చింది టీడీపీనే
Published on: Sat Mar 4, 2017 3:59PM

టీఆర్ఎస్ ఎంపీ కవిత, మంత్రి ఈటెల రాజేందర్ టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు టీటీడీపీ నేత ఎల్.రమణ. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడుని విమర్శించే స్థాయి కాని, అనుభవం కాని కవిత, రాజేందర్‌లకు లేవని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం తెచ్చిన ఘనత తెలుగుదేశానిదేనని..దళితులకు కూడా రాజకీయ అవకాశాలు కల్పించి వారిని ప్రొత్సహించింది ఒక్క టీడీపీ మాత్రమే అన్నారు. రైతుల ఆత్మహత్యలపై సీఎం కేసీఆర్ నోరు విప్పాలని రమణ డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పడే నాటికి మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను లోటు బడ్జెట్‌లోకి తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌దేనని విమర్శించారు. ఎప్పటికీ టీడీపీ పేదల పక్షాన పొరాడుతుందని చెప్పారు.


