TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

6 ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకున్న టీడీపీ

Published on: Fri Mar 3, 2017 2:43PM

ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఆరు స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి సాయంత్రం వరకు సమయం ఉంది. అయితే స్వతంత్ర అభ్యర్థులంతా తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లైంది. అయితే వీరి ఎన్నికను ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 

విజేతలు వీరే:

* అనంతపురం జిల్లా - దీపక్ రెడ్డి
* శ్రీకాకుళం జిల్లా -  శత్రుచర్ల విజయరామరాజు
* పశ్చిమగోదావరి జిల్లా - మంతెన సత్యనారాయణరాజు, అంగర రామ్మోహన్
* తూర్పుగోదావరి జిల్లా - చిక్కాల రామచంద్రరావు
* చిత్తూరు జిల్లా - దొరబాబు