TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఔను కళ్యాణి రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారట!

Published on: Fri May 25, 2012 2:06PM

గ్లామర్ తారలందరూ జయప్రద, జయసుధ, రోజా వంటి సీనియర్ల బాటలో రాజకీయరంగ ప్రవేశం చేసేస్తున్నారు. కొత్తగా ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు సినిమాతో తెలుగు ప్రక్షకులకు పరిచయమైన నటి కళ్యాణి కూడా రాజకీయ తెరంగేట్రం చేసుకుంటున్నారు. అయితే ఏ పార్టీ తరుపున బయటకు రావాలో ఆమె ముందుగానే నిర్ణయించుకున్నా మీడియాకు మాత్రం తెలియనీయలేదు. దర్శకుడు సూర్యకిరణ్ ను పెళ్ళాడిన ఈమే తెలుగుతెరకు దూరమయ్యారు. అయితే త్వరలోనే రాజకీయ తెరపై ప్రత్యక్షమవుతారు. కాబట్టి ఈమే తెరంగేట్రం సరే మరి రాజకీయాల్లో రాణింపు సంగతో అనుకుంటే 2014 ఎన్నికల వరకూ బోలెడు గడువు వుంది. అప్పటికి ఈమె పరిణతి చెందిన నాయకురాలిగా మారటానికి ముందస్తు వ్యూహం రచించారన్న మాట. ఏమైనా కళ్యాణి రాజకీయ తెరంగేట్రం అనేది ఓ కవి అన్న మాటను గుర్తు చేస్తోంది. పరిణతి చెందిన సినీయాక్టరే రేపటి రాజకీయ నాయకుడన్న ఆ మాటను గతంలో కొట్టిపారేశారు కానీ, ఇప్పుడు మాత్రం అందరూ ఒప్పుకునే తీరుతున్నారు.