TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హీరో రాజా పెళ్ళాం నల్లపిల్ల!

Published on: Sat Apr 26, 2014 11:45AM

 

 

 

సాధారణంగా తెల్లటి అమ్మాయిలకి నల్లటి అబ్బాయి మొగుడుగా వస్తాడు. తెల్లటి అబ్బాయికి నల్లటి అమ్మాయి పెళ్ళాంగా దొరుకుతుంది. పొట్టి వాళ్ళు పొడుగువాళ్ళని, పొడుగువాళ్ళు పొట్టివాళ్ళని లైఫ్ పార్టనర్‌గా ఫిక్స్ చేసుకుంటారు. ఈ సూత్రం హీరో రాజా విషయంలో కూడా మరోసారి ప్రూవ్ అయింది. రాజా పెళ్ళి శుక్రవారంనాడు చెన్నైలో జరిగింది. చైన్నైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అమృతతో రాజా పెళ్ళి క్రైస్తవ సంప్రదాయం ప్రకారం జరిగింది. తమిళనాడు గవర్నర్ కె.రోశయ్యతోపాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని నూతన జంటని ఆశీర్వదించారు.

 

మన రాజా ఎంత అందగాడు.. ఎంత తెల్లగా వుంటాడు. ఇప్పుడంటే ఫామ్‌లో లేడు కాబట్టి సరిపోయిందిగానీ, ‘ఆనంద్’ హిట్టయిన రోజుల్లో రాజా పేరు చెబితే అమ్మాయిలకి పూనకం వచ్చేసేది. అలాంటి రాజా పెళ్ళి చేసుకున్న అమృత నిఖార్సయిన నల్లపిల్ల. అందగత్తేగానీ, రాజా అంత  అందం మాత్రం లేదు. తన నలుపు దాచుకోవడానికి మేకప్ దట్టించిందిగానీ, వర్కవుట్ కాలేదు. అయినా సరదాకి అన్నాంగానీ, రంగులో ఏముంది? ఒకరినొకరు అర్థం చేసుకోవడంలోనే అంతా వుంది. రాజా, అమృత పిల్లాపాపలతో, మనవళ్ళు మనవరాళ్ళతో వర్ధిల్లాలని ఆశీర్వదించేద్దాం.