TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కోమాలోకి మాజీ టెలికం మంత్రి సుఖరాం: న్యాయవాది

Published on: Fri Jan 6, 2012 1:30PM

న్యూఢిల్లీ: 1993 టెలికం కుంభకోణం కేసులో శిక్ష పడిన టెలికం మాజీ మంత్రి సుఖరాం కోమాలోకి వెళ్లారని ఆయన తరఫు న్యాయవాది శుక్రవారం ఢిల్లీ కోర్టుకు తెలిపారు. 84 ఏళ్ల వయస్సు గల సుఖరాం ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  సుప్రీంకోర్టు నుంచి సుఖరాంకు ఏ విధమైన ఊరట లభించలేదు. 1993 టెలికం కుంభకోణం కేసులో మూడేళ్లు జైలు శిక్ష పడిన సుఖరాంను ట్రయల్ కోర్టు ముందు హాజరు కావాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. ఆరోగ్య కారణాలు చెప్పి ఆయన తప్పించుకున్నారు. హృద్రోగ సంబంధమైన సమస్యతో ఆంజియోగ్రామ్ చేయించుకున్న సుఖరామ్ ఆస్పత్రిలో ఉన్నారని ఆయన తరఫు న్యాయవాది సిబిఐ న్యాయమూర్తి రమేష్ శర్మకు చెప్పారు. అయితే, మరో ఇద్దరు దోషులు మాజీ అధికారి రును ఘోష్, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త పి. రామారావు న్యాయమూర్తి ముందు హాజరయ్యారు. వారిద్దరిని జైలుకు పంపించారు.