TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో తెలంగాణ సైబర్ పోలీసుల ఆపరేషన్.. ఆరుగురు అరెస్టు

Published on: Wed Jan 28, 2026 5:36AM

తెలంగాణ సైబర్ పోలీసులు కేరళ, కర్నాటకల్లో భారీ ఆపరేషన్ నిర్వహించి ఆరుగురిని అరెస్టు చేశారు. కేవలం వృద్ధులను టార్గెట్ చేసుకుని డిజిటల్ అరెస్టు పేరుతో కోట్లాది రూపాయలు కొట్టేఃసిన సైబర్ నేరగాళ్ల ముఠాలోని ఆరుగురిని తెలంగాణ పోలీసులు కేరళ, కర్నాటక రాష్ట్రాలలో నిర్వహించిన ఈ ఆపరేషన్ లో అరెస్టు చేశారు. వివరాలలోకి వెడితే వృద్ధులను టార్గెట్ చేసుకుని డిజిట్ అరెస్టు పేరుతో పలువురి నుంచి దాదాపు 16 కోట్లు దాచుకున్న సైబర్ నేరగాళ్ల కు సంబంధించి ఫిర్యాదులు అందుకున్న తెలంగాణ పోలీసులు సాంకేతికత ఆధారంగా వీరు కర్నాటక, కేరళ రాష్ట్రాలలో ఉన్నట్లు గుర్తించారు.

ఆ రాష్ట్రాల పోలీసులతో సమన్వయంతో రహస్య ఆపరేషన్ నిర్వహించిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేరళలో ముగ్గురిని, కర్నాటకలో ముగ్గురిని అరెస్టు చేసింది వారిని హైదరాబాద్ కు తరలించి విచారణ చేస్తున్నది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని తెలుస్తున్నది. వృద్ధులను టార్గెట్ చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబర్ సెక్యూరిటీ అధికారులు తెలిపారు.