ఎంతైనా చంద్రబాబు ఇంటెలిజెంట్...

 

తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్ మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్సలు గుప్పించారు. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశంసించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కేసీఆర్ ఇటీవల భేటీ అయిన సంగతి తెలిసిందే కదా. దీనిపై వీహెచ్ మాట్లాడుతూ... కాపులను ఆకర్షించేందుకే.. పవన్ కల్యాణ్ తో కేసీఆర్ సన్నిహితంగా మెలుగుతున్నారని... గతంలో లాల్ బహదూర్ స్టేడియంలో జరగిన బహిరంగ సభకు మోదీ హాజరైనప్పుడు... పవన్ కు ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చారని, చంద్రబాబు లేచి షేక్ హ్యాండ్ ఇచ్చేలోగానే ముందుకు వెళ్లిపోయారని గుర్తు చేశారు. కానీ, చంద్రబాబు చాలా ఇంటెలిజెంట్ అని... మరుసటి రోజే పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి, మొత్తం సెట్ చేసేశారని చెప్పారు. 'బ్రదర్ నాకు సపోర్ట్ చెయ్... మొత్తం నేను చూసుకుంటా' అంటూ పవన్ ను గ్రిప్ లో పెట్టుకున్నారని తెలిపారు. ఇప్పుడు అదే పని కేసీఆర్ కూడా చేస్తున్నారని చెప్పారు. వాస్తవానికి జనాలకు ఒకటి చూపిస్తున్నారని, లోపల మాత్రం మరొకటి జరుగుతోందని అన్నారు. అవగాహన లేకుండానే కేసీఆర్ ను పవన్ కల్యాణ్ పొగుడుతున్నారని విమర్శించారు.