తెలంగాణ పదోతరగతి ఫలితాలు విడుదల...
Published on: Wed May 3, 2017 5:27PM

తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఈ రోజు సచివాలయంలో విడుదల చేశారు. మొత్తం 533701 మంది విద్యార్థులు పరీక్ష రాయగా వారిలో రెగ్యులర్ విద్యార్థులు 507938 ఉన్నారు. ప్రైవేటు విద్యార్థులు 25763 మంది ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 84.15 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాల్లో రెగ్యులర్ విద్యార్థుల్లో బాలికల ఉత్తీర్ణత శాతం 85.37 శాతం, బాలుర ఉత్తీర్ణత శాతం 82.95 గా నమోదైంది. కాగా ఈ ఫలితాల్లో కూడా బాలికలదే పై చేయి.


