11 నుంచి ఆర్టీసీ సమ్మె- బస్సులేవీ తిరగనివ్వం
Published on: Tue Jun 5, 2018 1:19PM

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈ నెల 11 నుంచి నిరవధిక సమ్మెకు దిగనుంది. పదో తేదీ రాత్రి 12 గంటలకు బయల్దేరే మొదటి బస్సుని ఆపి, ఈ సమ్మెని ప్రారంభిస్తామని కార్మిక నేతలు ప్రకటించారు. తమ జీతాలకు సంబంధించిన పీఆర్సీ మీద యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ చర్యకు దిగనున్నట్లు నేతలు చెప్పారు. సమ్మె నోటీసు ఇచ్చినా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి పిలుపూ రాలేదని మండిపడ్డారు. అయితే ఇప్పటికే నష్టాలలో ఉన్న ఆర్టీసీలో జీతాలు పెంచేందుకు ప్రభుత్వం ఏమంత సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.


