తెలంగాణ పోలీసులకు కొత్త బ్యాడ్జ్
Published on: Wed Aug 13, 2014 4:45PM

తెలంగాణ పోలీసు శాఖకు కొత్త లోగో తయారు చేశారు. ఈ లోగో (బ్యాడ్జ్)ని మంగళవారం సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ బ్యాడ్జ్‌లను సీఎం కేసీఆర్ స్వయంగా డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్ కమిషనర్ మహేందర్ రెడ్డి భుజాలకు అలంకరించారు. ఈ బ్యాడ్జీ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఎం మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తదితర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


