TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల.. టాప్ లో జగిత్యాల

Published on: Mon May 13, 2019 12:27PM

 

తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. సచివాలయంలోని ‘డీ’ బ్లాక్ కాన్ఫరెన్స్ హాలులో విద్యాశాఖ కార్యదర్శి బి. జనార్దన్ రెడ్డి ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 92.43 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈసారి కూడా పదో తరగతి ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలికల ఉత్తీర్ణత 93.68 శాతం ఉండగా.. బాలురు 91.18 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో రాష్ట్రంలో జగిత్యాల జిల్లా మొదటి స్థానంలో నిలచింది. జగిత్యాల జిల్లాలో 99.73 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మరోవైపు ఈ ఫలితాల్లో హైదరాబాద్‌ చివరి స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌లో ఉత్తీర్ణత శాతం 83 శాతంగా ఉంది.

ఇటీవల తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. టాపర్స్ ని కూడా కొన్ని సబ్జక్ట్స్ లో ఫెయిల్ చేశారు. కొందరికి జీరో మర్క్స్ వేశారు. కొందరికి ఒక సబ్జెక్టు పరీక్ష రాస్తే మరో సబ్జెక్టు రాసినట్టు మార్క్స్ ఇచ్చారు. ఇలా ఫలితాలు తప్పులతడకగా వచ్చాయి. ఇంటర్ లో ఫెయిల్ అయిన 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసన సెగలు తగిలాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని.. ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళం పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకున్న తెలంగాణ విద్యాశాఖ.. కాస్త ఆలస్యంగా పదో తరగతి ఫలితాలను ప్రకటించింది.