TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల షెడ్యూలు వచ్చేసింది!

Published on: Sat Jan 23, 2021 2:37PM

ఈ విద్యాసంవత్సరం క్యాలెండర్ ని తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. 9,10 తరగతుల వారికి ఫిబ్రవరి 1నుండి ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కానున్నాయి. లాస్ట్ వర్కింగ్ డే మే 26 కాగా.. వేసవి సెలవులు మే 27 నుండి జూన్ 13 వరకు ఉండనున్నాయి. పదో తరగతి వార్షిక పరీక్షలను మే 17 నుండి మే 26 వరకు నిర్వహించనున్నారు.

 

2020-21 విద్యాసంత్సరానికి మొత్తం 204 పని దినాలు ఉండనున్నాయి. ఫిజికల్ క్లాసులు 89 పనిదినాలు కాగా.. డిజిటల్ తరగతులు 115 రోజులుగా ఉండనున్నాయి. అయితే.. హాజరు శాతం తప్పనిసరి కాదని విద్యాశాఖ ప్రకటించింది. విద్యార్థుల హాజరుపై తల్లి దండ్రుల అనుమతి తప్పని సరి అని పేర్కొంది. ఇక స్కూల్ టైమింగ్స్ విషయానికి వస్తే..  గ్రామీణ, పట్టణాల్లో 9:30 నుండి 4.45 వరకు కాగా.. హైదరాబాద్ లో 8:45 నుండి 4 గంటల వరకు పాఠశాలలు ఉండనున్నాయి.