పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడ్డ పదో తరగతి పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా, కోవిడ్ ‌-19 నిబంధనలకు లోబడి జూన్‌ 8వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో భౌతిక దూరం పాటించాలన్న హైకోర్టు సూచనలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న 2,530 పరీక్షా కేంద్రాలకు అదనంగా మరో 2,005 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. జూన్‌ 8 నుంచి జూలై 5వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి పరీక్షకు రెండు రోజుల వ్యవధి వచ్చేలా షెడ్యూల్‌ను రూపొందించారు. పరీక్షలన్నీ ఉదయం 9.30 నుంచి మధ్యాహం 12.15 గంటల మధ్య నిర్వహించనున్నారు.

జూన్‌ 8వ తేదీన ఇంగ్లీష్‌ మొదటి పేపర్‌

జూన్ 11వ తేదీన ఇంగ్లీష్‌ రెండో పేపర్‌

జూన్ 14వ తేదీన గణితము మొదటి పేపర్‌

జూన్ 17వ తేదీన గణితము రెండో పేపర్‌

జూన్ 20వ తేదీన సామాన్యశాస్త్రము మొదటి పేపర్‌ ‌(భౌతిక శాస్త్రం) 

జూన్ 23వ తేదీన సామాన్యశాస్త్రము రెండో పేపర్‌ ‌(జీవశాస్త్రం)

జూన్ 26వ తేదీన సాంఘిక శాస్త్రం మొదటి పేపర్‌

జూన్ 29వ తేదీన సాంఘిక శాస్త్రం రెండో పేపర్‌

జూలై 02వ తేదీన ఓరియంటర్‌ మొయిన్‌ లాంగ్వేజ్‌ మొదటి పేవప్‌ (సంస్కృతము, అరబిక్‌)

జూలై 05వ తేదీన ఓరియంటర్‌ మొయిన్‌ లాంగ్వేజ్‌ రెండో పేపర్‌ (సంస్కృతము, అరబిక్‌)