TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సచివాలయంలో ఊడి పడిన పెచ్చులు

Published on: Thu Jul 24, 2025 8:59PM

 

తెలంగాణ సచివాలయంలో మరోసారి పెచ్చులు విరిగిపడ్డాయి. భారీ వర్షాల కారణంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాన్వాయ్ వచ్చే  మార్గంలో పెచ్చులు ఉడి పడడంతో సచివాలయ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. కాగా  గత వారం రోజుల నుంచి సచివాలయానికి సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా సచివాలయంలో పెచ్చులు కూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటన సచివాలయ నిర్మాణ నాణ్యత, భద్రతా ప్రమాణాలపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తింది. అయితే గతంలో కూడా రెండుసార్లు ఇలా పెచ్చులు ఊడగా... నిర్మాణ సంస్థ చర్యలు చేపట్టింది.