స్కూళ్ళు మూసేస్తారా... హవ్వ...
Published on: Fri Nov 14, 2014 9:51AM

కొత్త స్కూళ్ళను పెట్టడం మాని ఉన్న స్కూళ్ళను మూసేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించడం సరైన పని కాదని భారతీయ జనతా పార్టీ నాయకుడు డాక్టర్ లక్ష్మణ్ శుక్రవారం నాడు శాసనసభలో అన్నారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ, విద్యార్థుల సంఖ్య లేదన్న నెపంతో స్కూళ్ళని మూసేయడం సరి కాదని అన్నారు. అలాగే విద్యార్థులు తక్కువగా వున్నారని ఉపాధ్యాయులను వేరేచోటకి బదిలీ చేయడం కూడా సరైన పని కాదన్నారు. గిరిజన ప్రాంతాల్లో స్కూళ్ళకు 10 మంది విద్యార్థులు రావడమే కష్టమని.. అలాగని గిరిజన ప్రాంతాల్లో స్కూళ్ళను మూసేయడమేంటని ఆయన ప్రశ్నించారు. పాఠశాలల మూసివేతతో గిరిజన విద్యార్థులు విద్యకు దూరమవుతారని ఆయన అన్నారు.


