TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బుధవారం తెలంగాణలో స్కూళ్ళు బంద్

Published on: Tue Sep 9, 2014 6:21PM

 

బుధవారం నాడు విద్యాసంస్థల బంద్‌ చేయాలని పలు తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు నిరసనగా విద్యార్థి సంఘాలు బంద్‌కి పిలుపునిచ్చాయి. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించవద్దని విద్యార్థులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు పోరాటానికి సిద్ధమయ్యారు.