Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణ ఆర్టీసీ లోగో సిద్దం కాలేదు: సజ్జనార్
posted on: May 23, 2024 12:12PM
తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. టీఎస్ పేరును టీజీగా మారుస్తామని ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇందుకు సంబంధించి ఉత్తర్వులు సైతం జారీ చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ విజ్ఞప్తిని కేంద్రం సైతం అంగీకరించింది. ఈ మేరకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతో తెలంగాణలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లకు టీజీ పేరును ఇస్తున్నారు. ఈ మార్పులతో తాజాగా టీఎస్ఆర్టీసీ పేరును టీజీఎస్ఆర్టీసీగా మార్చారుఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రాన్ని సూచించే అధికారిక సంక్షిప్త పదం టీఎస్ నుంచి టీజీగా మారుస్తూ ఇటీవల సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, ఏజెన్సీలు, ఇతర స్వయం ప్రతిపత్తి సంస్థలు, అధికారిక హోదాలు సూచించే బోర్డుల్లో రాష్ట్రాన్ని టీజీగా పేర్కొనాలని సూచించారు. జీవోలు, పాలసీ పేపర్లు, నోటిఫికేషన్లు, సర్క్యులర్లు, లెటర్ హెడ్స్, అధికారిక పత్రాల్లో సైతం టీజీ అని వచ్చేలా చూడాలన్నారు.ఇదిలా ఉంటే తెలంగాణ ఆర్టీసీని టీఎస్‌ఆర్టీసీగా పిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం టీజీగా మార్చడంతో టీఎస్‌ఆర్టీసీ కూడా టీజీ ఆర్టీసీగా మారుతుందని వార్తలు వచ్చాయి. ఇక ఆర్టీసీ లోగో కూడా మారిపోయిందంటూ సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అయ్యాయి. మారిన లోగో ఇదేనంటూ కొన్ని ఫొటోలు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే దీంట్లో ఏ మాత్రం నిజం లేదని ఆర్టీసీ ఎండీ సజ్జనర్ క్లారిటీ ఇచ్చారు. లోగో మార్పుపై జరుగుతోన్న ప్రచారానికి సంబంధించి ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణ ఆర్టీసీ లోగో మార్పు విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తప్పుబట్టారు. కొత్త లోగో ఇంకా సిద్ధం కాలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ పెట్టారు.
‘కొత్త లోగో విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదు. టీజీఎస్ ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న లోగో ఫేక్. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. కొత్త లోగోను సంస్థ రూపొందిస్తోంది. కొత్త లోగోను టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఇంకా ఫైనల్ చేయలేదు’ అని ఆయన పేర్కొన్నారు. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.






