తెలంగాణలో 120 స్కూలు బస్సులు సీజ్: నెపం దొరికింది!
Published on: Fri Jul 25, 2014 11:29AM
.jpg)
స్కూళ్ళని ఇబ్బందులపాలు చేయడానికి ప్రభుత్వ అధికారులకు మరో నెపం దొరికింది. మెదక్ జిల్లా మాసాయిపేట దగ్గర స్కూలు బస్సును రైలు ఢీకొన్న నేపథ్యంలో తెలంగాణ ఆర్టీయే అధికారులు ఆ నెపంతో స్కూళ్ళను ఇబ్బంది పెట్టడం ప్రారంభించారు. ఆర్టీఏ అధికారులు స్పెషల్ ఆపరేషన్ పేరుతో తెలంగాణ వ్యాప్తంగా భారీగా దాడులు నిర్వహించారు. నిబంధనలు పాటించలేదంటూ 120 స్కూల్ బస్సులను అధికారులు సీజ్ చేశారు.


