తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు
Published on: Fri Sep 12, 2025 5:27PM
.webp)
తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ పేర్కొంది. మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే వీలుందని వాతావరణ శాఖ పేర్కొన్నాది.
ఇవాళ ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. శనివారం నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. వర్షాల ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందనిపేర్కొంది.


