TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు

Published on: Fri Aug 8, 2014 8:21PM

ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిషన్ ఏర్పాటు తక్షణమే అమలులోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 83(2) ప్రకారం కమిషన్ ఏర్పాటుకు జీవో జారీ చేశామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ స్పష్టం చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటుకు గవర్నర్ నరసింహన్ నిన్న అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక నుండి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే నియామకాలు జరుగుతాయి.