TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి షాక్.. 

Published on: Thu Jul 8, 2021 10:09AM

తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపీ రేవంత్ రెడ్డికి హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. ఆయనపై రెండు కేసులు నమోదు చేశారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద కేసులు పెట్టారు సిటీ పోలీసులు. కొవిడ్ రూల్స్ బ్రేక్ చేయడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు స్పష్టించారనే ఫిర్యాదులతో రేవంత్ రెడ్డిపై బేగంబజార్, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లులో రెండు కేసులు నమోదయ్యాయి.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు ఎంపీ రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన నగరంలో ర్యాలీ నిర్వహించారు . ఉదయం జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా గాంధీభవన్ చేరుకున్నారు. పెద్దమ్మ గుడి, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు మీదుగా ఆయన ర్యాలీ సాగింది.  వందలాది కార్లు , బైకులతో రేవంత్ రెడ్డి ర్యాలీ సాగింది. అయితే అనుమతి లేకుండానే ర్యాలీ తీశారని,చాలా ప్రాంతాల్లో రోడ్లను బ్లాక్ చేశారనే ఫిర్యాదులతో కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. కొవిడ్ రూల్స్ బ్రేక్ చేశారనే ఆరోపణలతో డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద కేసులు పెట్టారు.