తెలంగాణలో కొత్త పార్టీ... ‘తెలంగాణ ప్రజల పార్టీ’

 

జస్టిస్ చంద్రకుమార్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది.  ‘తెలంగాణ ప్రజల పార్టీ’ పేరిట ఆయన కొత్త పార్టీ  ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రకుమార్ మాట్లాడుతూ, అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా తమ పార్టీ పని చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో అందరికీ సమానావకాశాలు కల్పించడం కోసం, కులవివక్ష నిర్మూలన, నిరుపేదలందరికీ, ఉచిత విద్య, వైద్య సౌకర్యాలు కల్పించడం తమ పార్టీ ఆశయాలని పేర్కొన్నారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. తొలుత, పార్టీని ప్రకటించిన అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు.