TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి

Published on: Fri Sep 26, 2025 10:18PM

తెలంగాణ నూతన డీజీపీగా శివధర్‌ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు నియామక పత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం (సెప్టెంబర్ 26) అందజేశారు. ఈ నెల 30న ప్రస్తుత డీజీపీ పదవీ విరమణ చేయనున్నారు ఆయన స్థానంలో 1994 బ్యాచ్‌కి చెందిన  ఐపీఎస్ అధికారి అయిన శివధర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది.    శివధర్‌ రెడ్డి వచ్చేనెల1వ తేదీన రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు.  పోలీసు శాఖలో వివిధ విభాగాల్లో పని చేసిన శివధర్ రెడ్డి తప కెరీర్‌లో గ్యాలంట్రీ, పోలీస్, ప్రెసిడెంట్ మెడల్స్ అందుకున్నారు.  శివధర్ రెడ్డి ఐక్యరాజ్యస సమితి శాంతి పరిరక్షణ వింగ్‌లోకూడా పనిచేశారు.ప్రస్తుతం శవధర్ రెడ్డి తెలంగాణ  ఇంటలిజెన్స్ ఛీఫ్ గా ఉన్నారు.  

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తూలే కలాన్‌ గ్రామానికి చెందిన శివధర్‌రెడ్డి. విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్ లోనే సాగింది.  ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ చేసి ఆయన కొద్ది కాలం అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ క్లియర్‌ చేసి 1994 లో ఇండియన్ పోలీస్ సర్వీస్‌లో అడుగుపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో   అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లిలో ఎఎస్పీగా పని చేశారు.  అలాగే గ్రేహౌండ్స్‌ స్క్వాడ్రన్ కమాండర్ గా బెల్లంపల్లి, ఆదిలాబాద్, నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల ఎస్పీగా  పనిచేశారు.  2014-2016 మధ్య తెలంగాణకి తొలి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేశారు.    మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నయీం ఎన్‌కౌంటర్ ఆపరేషన్ శివధర్ రెడ్డి హయాంలోనే జరిగింది.